Ram Pothineni Movie Red : రామ్ రెడ్ మూవీకి ఓటీటీ రెడ్ సిగ్నల్!

Ram Pothineni Movie Red : గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్.. ఈ సినిమా

Krishna
Published on: 13 Sept 2020 6:40 PM IST
Ram Pothineni Movie Red :  రామ్ రెడ్ మూవీకి ఓటీటీ రెడ్ సిగ్నల్!
X

Red

Ram Pothineni Movie Red : గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్.. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది.

అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, నాని v చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. అయితే రామ్ రెడ్ మూవీ సినిమాని కూడా ఓటీటీ వేదికగా రిలీజ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం ధియేటర్ లోనే రిలీజ్ చేయాలనీ భావించారు. కానీ తర్వాత మాత్రం ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థకు ఒకే చెప్పినప్పటికీ మాత్రం రివర్స్ వాళ్ళు నో చెప్పారట..దీనితో చేసేది ఏమీ లేకా సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ మేకర్స్ రెడీ అవుతున్నారట..

తమిళ మూవీ 'తదమ్' స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కుతున్నప్పటికి సినిమా కథ, కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు.. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత రామ్ మూవీ కావడం, మళ్ళీ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Krishna

Krishna

Next Story