Ram Pothineni: మొట్టమొదటిసారిగా అలాంటి పాత్రలో కనిపించనున్న రామ్

Ram Pothineni is Going to Appear in the Role of a Police Officer
x

మొట్టమొదటిసారిగా అలాంటి పాత్రలో కనిపించనున్న రామ్

Highlights

Ram Pothineni: మొట్టమొదటిసారిగా అలాంటి పాత్రలో కనిపించనున్న రామ్

Ram Pothineni: యువ హీరో రామ్ పోతినేని ఈమధ్యనే ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత "రెడ్" అనే సినిమాలో కనిపించిన రామ్ తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "ది వారియర్" అనే టైటిల్ని ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ పోతినేని ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటిదాకా రామ్ చేసిన పాత్రలు అన్నిటిలోనూ ఈ పాత్ర విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. ఇప్పటిదాకా ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రామ్ ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ అలరిస్తుందో వేచి చూడాలి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories