Ram Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్

Ram Pothineni: యువ హీరో రామ్ పోతినేని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన "ఇస్మార్ట్ శంకర్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 28 May 2022 3:18 PM IST
Ram Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
X

Ram Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్

Ram Pothineni: యువ హీరో రామ్ పోతినేని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన "ఇస్మార్ట్ శంకర్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత అభిమానులు రామ్ ను "ఉస్తాద్" అని పిలవడం మొదలపెట్టారు. ఆ టైటిల్ తనకి ఎప్పటికీ ఉండిపోవాలి అనే ఉద్దేశంతో బోయపాటి శ్రీను డైరెక్షన్లో తను చేయబోతున్న సినిమాకి "ఉస్తాద్" అనే టైటిల్ ను పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి కుటుంబం ఈ టైటిల్ ను తీసేసుకోబోతుంది.

"మత్తు వదలరా" సినిమాతో హీరోగా మారిన కీరవాణి తనయుడు శ్రీ సింహ "తెల్లవారితే గురువారం" సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీసింహ హీరో గా ఒక కొత్త దర్శకుడి తో చేయబోతున్న సినిమాకి "ఉస్తాద్" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ విషయంలో రామ్ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. రాజమౌళి కుటుంబం కాబట్టి తిరిగి ఆ టైటిల్ వెనక్కి తీసుకోలేరు రామ్. మరోవైపు రామ్ "ది వారియర్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story