Ram Pothineni: బొంగులో క్లైమాక్స్ కాదు..అంతకు మించి..రామ్ ట్వీట్ వైరల్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీపై ఆడియెన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ తో చెప్పకనే చెప్పాడు.

Dhatripriya
Updated on: 2 Jun 2023 7:00 PM IST
Ram Pothineni: బొంగులో క్లైమాక్స్ కాదు..అంతకు మించి..రామ్ ట్వీట్ వైరల్
X

Ram Pothineni: బొంగులో క్లైమాక్స్ కాదు..అంతకు మించి..రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీపై ఆడియెన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ తో చెప్పకనే చెప్పాడు.

గ్లింప్స్ లో బోయపాటి మార్క్ డైలాగులు కూడా పేలాయి. ఇంకేంటి దాటేది బొంగులో లిమిట్స్ అంటూ రామ్ రెచ్చిపోయాడు. #RAM20 గా ప్రచారం జరుపుకుంటున్న ఈ సినిమాపై రామ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. 24 రోజుల యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశాం. ఇది క్లైమాక్స్ కాదు..అంతకు మించి అని అర్థం వచ్చేలా రామ్ ట్వీట్ చేశాడు. రామ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ రామ్ ను కోరుతున్నారు. అలాగే టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు కూడా.

రామ్, బోయపాటిల ఫస్ట్ గ్లింప్స్ అందర్ని ఆకట్టుకుంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ మాస్ అవతారానికి పాజిటివ్ రివ్యూస్ దక్కాయి. ఇక, తాజాగా రామ్ చేసిన ట్వీట్ తో సినిమాకి మరింత క్రేజ్ డెవలప్ అయింది. ఇందులో రామ్ కు జోడీగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ఇక దర్శకుడు బోయపాటి ఓవైపు చిత్రీకరణ జరుపుతూనే మరోవైపు డబ్బింగ్ పనులను కూడా కానిచ్చేస్తున్నాడు.

రామ్ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, మరో విషయం ఏంటంటే, ఈ సినిమాతో ఎనర్జిటిక్ హీరో రామ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story