గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్

Ram Pothineni: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో యువ హీరో రామ్ పోతినేని మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Arun Chilukuri
Updated on: 1 July 2022 4:00 PM IST
Ram Pothineni and Gautham Menon to Team Up
X

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్

Ram Pothineni: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో యువ హీరో రామ్ పోతినేని మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక తాజాగా ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో "ది వారియర్" అనే ఒక సినిమా చేస్తున్నారు రామ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా ఒక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి గౌతమ్ తో పని చేయాలని రామ్ కి ఎప్పటినుంచో ఉందట. కానీ ఇప్పటిదాకా అది వర్క్ అవుట్ అవ్వలేదు. తాజాగా గౌతం మీనన్ రామ్ ను కలిసి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ కథ చెప్పారట. రామ్ కి కూడా ఈ కథ బాగా నచ్చటంతో ఓకే చెప్పేలానే ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బోయపాటి సినిమా షూటింగ్ పూర్తవగానే గౌతమ్ మీనన్ సినిమాని రామ్ పట్టాలెక్కించనున్నారట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story