Rapo19: ఎనర్జిటిక్ హీరో తో స్టార్ డైరెక్టర్

Rapo19: కమర్షియల్ సినిమాలలో కామెడీని పండిస్తూ విజయాలు అందుకుంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

Venkata Chari
Published on: 19 April 2021 4:38 PM IST
Ram Pothineni and Anil Ravipudi Combo Movie Fix? | Ram New Movie
X

హీరో రామ్, అనిల్ రావిపూడి

Rapo19: కమర్షియల్ సినిమాలలో కామెడీని పండిస్తూ విజయాలు అందుకుంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తొలి సినిమా 'పటాస్‌'విజయంతో.. ఇక వెనుదిరిగి చూసే అవసరం లేకుండా దూసుకెళ్తున్నాడు అనిల్. వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. స్టార్ హీరోలందరూ అనిల్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం 'ఎఫ్‌3' సినిమా షూటింగ్‌లో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు.

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రెండేళ్ల క్రితం వచ్చిన 'ఎఫ్2' కు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఈ క్రేజీ డైరెక్టర్ ఎవరితో పనిచేస్తాడనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్.. సరైన విజయాన్ని నమోదుచేయలేకపోయాడు. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ కి జోడీగా కృతి శెట్టి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్.. అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఒప్పందు కుదిరినట్లు టాక్.

ఇప్పటికే రామ్‌కు డైరెక్టర్ స్టోరీ వినిపించి ఓకే చేపించుకున్నాడని సమాచారం. కాగా, రవితేజ హీరోగా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా ది గ్రేట్' సినిమాని ముందు రామ్‌తోనే అనుకున్నారట. కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అయితే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో.. ఈసారి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని రామ్ అనుకుంటున్నట్లు మాట్లాడుకుంటున్నారు. 'ఎఫ్3' సినిమా పూర్తి కాగానే.. రామ్-అనిల్ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది కూడా నాన్‌స్టాప్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని చర్చించుకుంటున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story