మళ్లీ రిపీట్ అవుతున్న 'నేను శైలజ' కాంబో

Ruthvik
Published on: 22 May 2019 1:05 PM IST
మళ్లీ రిపీట్ అవుతున్న నేను శైలజ కాంబో
X

ఇప్పటిదాకా సాఫ్ట్ లవర్ బాయ్ క్యారెక్టర్లలో కనిపించిన ఎనర్జిటిక్ హీరో రామ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో మాస్ అవతారం ఎత్తనున్నాడు. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా జూన్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంపై కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం 'ఇస్మార్ట్ శంకర్' సినిమా పూర్తయిన తర్వాత రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'నేను శైలజ' మరియు 'ఉన్నది ఒకటే జిందగీ' వంటి సినిమాలలో నటించాడు. ఇప్పుడు మూడోసారి ఈ కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యనే 'చిత్రాలహరి' అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న కిషోర్ తిరుమల రామ్ కోసం ఇప్పుడు ఒక మంచి స్క్రిప్ట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. స్రవంతి మూవీస్ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story