చావు కూడా చైనాదేనా..నువ్వే చస్తావ్ జాగ్రత్త .. కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇచ్చిన వర్మ

చావు కూడా చైనాదేనా..నువ్వే చస్తావ్ జాగ్రత్త .. కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇచ్చిన వర్మ
x
Ramgopal Varama
Highlights

కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ పెట్టారు. "ప్రియమైన వైరస్, ద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూపోయే బదులుగా మీరు కూడా మాతో పాటు చనిపోతారని తెలుసుకో.

కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ పెట్టారు. "ప్రియమైన వైరస్, బుద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూపోయే బదులుగా మీరు కూడా మాతో పాటు చనిపోతారని తెలుసుకో. ఎందుకంటే నువ్వు కూడా ఓ పారసైట్‌వే(పరాన్నజీవి). నామాటలపై నమ్మకం లేకపోతే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకో. కాబట్టి నా అభ్యర్థన ఏమిటంటే నువ్వు జీవించు, మమ్మల్ని జీవించనివ్వు. జ్ఞానం ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నా? అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. వైరస్‌కి మీలాగా ట్విటర్ ఖాతా లేదు. హాస్పిటల్‌కి వెళ్లి దానికి డైరెక్ట్‌గానే వార్నింగ్ ఇవ్వండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కరోనాపై అంతకుముందు ఓ ట్వీట్ పెట్టారు. ఇంతకాలం మనం ఎన్నో చైనీస్ వస్తువులను ఉపయోగించాం. ఇప్పుడు చావు కూడా చైనాదేనా అని ట్వీట్ చేసారు. ఈ కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్‌లో పుట్టింది. ఈ వైరస్ అక్కడ దాదాపు రెండు వేల మందికి పైగా బారినపడి చనిపోయారు.

చైనా నుంచి ఇతర దేశాలకు వస్తువులు దిగుమతి చేస్తారు. అయితే కరోనా ఇప్పుడు ఇండియాకూ వచ్చేసింది. తెలంగాణకు రాష్ట్రంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. గాంధీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories