RGV Tweet: పవన్ కళ్యాణ్‌కు రాంగోపాల్‌వర్మ వరుస ట్వీట్స్

RGV Tweet: పాన్‌ ఇండియాలో పవన్‌కల్యాణ్ పవర్ చూపించాలి

Rama Rao
Published on: 31 Jan 2022 12:54 PM IST
Ram Gopal Varma Tweets to Pawan Kalyan | Tollywood News Today
X

పవన్ కళ్యాణ్‌కు రాంగోపాల్‌వర్మ వరుస ట్వీట్స్

RGV Tweet: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానయాక్‌ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్నారు. ఇటీవల విడుదలైన పుష్ప బీటౌన్‌లో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్ సాధించిందని.. కాబట్టి.. భీమ్లానాయక్‌ని సైతం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నారు. పుష్ప సినిమానే అంత కలెక్ట్ చేస్తే పవర్ స్టార్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి..? పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్‌కి ఆన్సర్ చెయ్యలేమన్నారు. ఆర్జీవీ. అల్లు అర్జన్ గురించి నా ట్వీట్స్ అన్నీ వోడ్కా టైం లో పెట్టాను కానీ ఇప్పుడు పెట్టిన ట్వీట్స్ కాఫీ టైంలో పెడుతున్నానని వరుస ట్వీట్స్ చేశారు.


Rama Rao

Rama Rao

Next Story