Ram Gopal Varma: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్స్‌..

Ram Gopal Varma: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా..ఏది మాట్లాడినా సంచలనమే.

Arun Chilukuri
Updated on: 13 May 2022 8:00 PM IST
Ram Gopal Varma Shocking Comments on Bollywood Industry
X

Ram Gopal Varma: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్స్‌..

Ram Gopal Varma: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా..ఏది మాట్లాడినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ ‌వర్మ తాజాగా బాలీవుడ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ పనైపోయిందని ఆయన ట్వీట్ చేశారు. పుష్ప సినిమా ఘన విజయం సాధించినప్పటి నుంచి బాలీవుడ్‌పై వర్మ సెటైర్లు వేస్తున్నారు.

ఆ తర్వాత ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్‌-2 చిత్రాలు తిరుగులేని విజయం సాధించిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. దక్షిణాది చిత్రాలు సూపర్ డూపర్ సక్సెస్ సాధించడం ఉత్తరాది చిత్రాలు డీలా పడడం చూస్తుంటే కేవలం ఓటీటీల కోసమే బాలీవుడ్ సినిమాలను తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయన్నారు వర్మ. బాలీవుడ్‌ను దక్షిణాది సినిమాలు డామినెట్ చేస్తున్నాయనే చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. ఇలాంటి సమయంలో వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచేలా ఉన్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story