RGV Viral Video: అఖిల్ తొడగిల్లిన ఎన్టీఆర్; హీరోయిన్ల పరిస్థితి ఏంటన్న రాంగోపాల్ వర్మ

RGV Viral Video: ఆర్జీవీ ఎప్పుడు ఎవరిపై ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఫన్ ఎలిమెంట్ వెతికి మరీ షేర్ చేస్తుంటాడు.

Venkata Chari
Published on: 9 April 2021 11:37 AM IST
Ram Gopal Varma Shares Viral Video on Junior NTR
X

ఎన్టీఆర్, అఖిల్ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

RGV Viral Video: రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిపై ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ప్రతిదాంట్లో ఫన్ ఎలిమెంట్ వెతికి మరీ షేర్ చూస్తుంటాడు. దీంతో కొంతమంది ఫన్ గా తీసుకుంటే, మరికొంత మంది మాత్రం ఆర్‌జీవీ కి కౌంటర్లు వేస్తుంటారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవడం ఆయన స్పెషల్.

ప్రస్తుతం ఎన్టీఆర్, అఖిల్ కు సంబంధించిన ఓ వీడియో ను ట్రోల్ చేస్తూ ఆనందిస్తున్నాడు ఆర్జీవీ. ఈ వీడియోలో ఎన్టీఆర్ - అఖిల్ పక్కపక్కనే కూచుని ఉన్నారు. తారక్ ఏదో మాట్లాడుతూ అఖిల్ తొడ భాగంపై గిల్లుతాడు. దానికి అఖిల్ ఎంతో సిగ్గుతో ఎన్టీఆర్ ని అడ్డుకుంటుంటాడు. వీరి మధ్య సాగిన సరదా ఆట ఎంతో ఫన్ క్రియోట్ చేస్తుంది. ఈ ఫన్నీ వీడియోని రొమాంటిక్ ట్యాగ్ తో ఇన్ స్టాలో షేర్ చేశారు రాంగోపాల్ వర్మ.

``ఇంక హీరోయిన్ల భవిష్యత్ ఏంటి? హీరోయిన్ల విషయంలో చాలా విచారం ఫీలవుతున్నా..సో శాడ్`` అంటూ శాడ్ నెస్ ఈమోజీల్ని ఆశ్చర్యం వ్యక్తపరిచే ఈమోజీల్ని పెట్టి వీడియోని షేర్ చేశాడు ఆర్జీవీ. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రివర్స్ గా ఆర్జీవీ కి కౌంటర్లు విసురుతున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story