టాలీవుడ్ పెద్దలపై ఆర్జీవీ సంచలన కామెంట్స్.. తెలుగు సినీ పరిశ్రమకి నా జోహార్లు...

Ram Gopal Varma: టాలీవుడ్‌ సీనియర్ నటుడు, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Arun Chilukuri
Published on: 12 Sept 2022 1:05 PM IST
Ram Gopal Varma Sensational Tweets On Krishnam Raju Demise
X

టాలీవుడ్ పెద్దలపై ఆర్జీవీ సంచలన కామెంట్స్.. తెలుగు సినీ పరిశ్రమకి నా జోహార్లు...

Ram Gopal Varma: టాలీవుడ్‌ సీనియర్ నటుడు, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా కృష్ణంరాజు మృతికి నివాళిగా టాలీవుడ్‌లో షూటింగ్‌లు ఆపకపోవడంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కృష్ణంరాజు లాంటి పెద్ద మనిషి చనిపోతే.. కనీసం రెండు రోజులు కూడా షూటింగ్ ఆపలేరా అంటూ తెలుగు సినీ లోకాన్ని ప్రశ్నించారాయన.

భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, లాంటి గొప్ప చిత్రాలను అందించిన మహా నటుడు చనిపోతే షూటింగ్ ఆపకపోవడం సిగ్గు సిగ్గు.. తెలుగు సినీ పరిశ్రమకి జోహార్లు అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇటీవల తెలంగాణలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతోందని నెల రోజులు షూటింగ్‌లు బంద్‌చేశారు. కానీ పెద్దమనిషికి విలువ ఇవ్వడం లేదు. మనసు లేకపోయినా.. కనీసం చావుకి విలువ ఇద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story