
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఓ దిష్టి బొమ్మ అంటూ వివాదాస్పద పోస్ట్ చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ , వైసీపీ ఎమ్మెల్యే ఏఐసీసీ అధ్యక్షురాలు రోజా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యతో రోజా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చపై మొదలైంది. టీడీపీ సభ్యులపై ఆ పార్టీ అధినేతపై నిత్యం విమర్శలు వర్షం కురిపించే రోజా బాలకృష్ణతో ఫోటో దిగడం అందరిని ఆశ్ఛర్యానికి గురిచేసింది.
అయితే రోజా దిగిన ఫోటోపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యస్త్రాలు సంధించారు. సెల్ఫీ ఫోటోలో రోజా హీరోలా కనిపిస్తోందని, రోజా పక్కన ఉన్నది ఎవరో తెలియదని, చాలా అసహ్యంగా కనిపిస్తున్నారని అన్నారు. అంతేకాదు ఆ వ్యక్తి పక్కన ఉండడంతో రోజా అందాన్నిపాడు చేస్తున్నాడని, ఆవ్యక్తి ఎవరో చెప్పగలరా, నాకు తెలిసి దిష్టి బొమ్మ అనుకుంటున్నాను.. అంటూ వర్మ ట్విటర్లో సైటైర్లు వేశారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోటి దురుసుతనంతో వార్తల్లో నిలుస్తాడు. తరచు మెగా కుటుంబంపై నోటికి పనిచెప్పేవారు. తాజాగా ఇప్పుడు బాలయ్యపై టార్గెట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పై బాలయ్య ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ రోజా, వీరిద్దరు కలిసి దాదాపు ఆరు సినిమాలుపైగా చేశారు. గతంలో రోజా టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వారితో పరిచాలు ఉండేవి పైగా బాలకృష్ణ సినిమాల్లో కో స్టార్ కావడంతో..వారిద్దరు కలిసి చాలా రోజులు కావడంతో సెల్ఫీ దిగినట్లు సమాచారం. టీడీపీ తీర్థం పుచ్చుకున్న రోజా ఆ పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
Wowww Roja Garu looks like a HERO and some guy who I don't know on her right looks like yuckk..He's spoiling her beauty by spoiling the frame with his face ...Or maybe he is her Dishti Bomma pic.twitter.com/4uO19G6rZL
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




