వోట్ వేసేముందు ఈ సినిమా చూసి వెయ్యండి అంటున్న దర్శకుడు

వోట్ వేసేముందు ఈ సినిమా చూసి వెయ్యండి అంటున్న దర్శకుడు
x
Highlights

ఈ మధ్యనే నందమూరి తారకరామారావు బయోపిక్ గా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా తో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 29న...

ఈ మధ్యనే నందమూరి తారకరామారావు బయోపిక్ గా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా తో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 29న విడుదలైన ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. కేవలం లక్ష్మీపార్వతి మరియు ఎన్టీఆర్ రాజకీయ జీవితం పైన మాత్రమే ఈ సినిమాలో ఫోకస్ చేశాడు ఆర్జీవి. ఈ నేపథ్యంలో స్వయానా ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నట్లు ఈ సినిమాలో చూపించాడు వర్మ. అంతేకాక ఈ సినిమా లో పట్టుబట్టి మరీ ఎన్నికలకు ముందే విడుదల చేశారు.తాజాగా రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ పేరును కూడా వాడేస్తూ ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. నిజమైన మరియు నిజాయితీ వున్న ఎన్టీఆర్ అభిమానులు మరియు జూనియర్ ఎన్టీఆర్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో నారా చంద్రబాబు నాయుడు చూసిన తరువాతే తమ ఓటు వెయ్యాలని చెబుతున్న రామ్గోపాల్వర్మ, నారా లోకేష్ టిడిపి కి అసలైన వారసుడు కాదని నిజమైన వారసుడు, టీడీపీకి మంచి భవిష్యత్తును తీసుకొచ్చే వారసుడు కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని ప్రకటించటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ కు ఎన్టీఆర్ అభిమానులు అందరూ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories