త్వరలో విడుదల కానున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లోని రెండవ పాట

త్వరలో విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని రెండవ పాట
x
Highlights

నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ గా విడుదలైన రెండు భాగాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' ప్రేక్షకులను...

నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ గా విడుదలైన రెండు భాగాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అందరి కళ్ళు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా పైనే వున్నాయి. ఇప్పటికే ఈ సినిమా తాలూకు టీజర్ మరియు ట్రైలర్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని పాటలు కూడా విడుదలై వివాదాలకు దారి తీశాయి.

ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా లోని రెండవ పాటను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా లోని రెండవ పాటలు మార్చి 7వ తారీఖున ఉదయం 9:27 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. జీవి ఫిలింస్ పతాకంపై రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories