కొడాలి నాని ఎవరు.. RGV షాకింగ్ కామెంట్స్..

RGV Vs Kodali Nani: ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది.

Arun Chilukuri
Published on: 5 Jan 2022 4:30 PM IST
Ram Gopal Varma Counter to Minister Kodali Nani
X

కొడాలి నాని ఎవరు.. RGV షాకింగ్ కామెంట్స్..

RGV Vs Kodali Nani: ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. సీన్ లోకి రామ్ గోపాల్ వర్మ ఎంటరవడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారుతోంది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని తనను అందరూ అడుగుతున్నారని అయితే కొడాలి నాని ఎవరో తనకు తెలియదని ఆర్జీవి కౌంటర్ ట్వీట్ చేశారు. తనకు తెలిసినది హీరో నాచురల్ స్టార్ నాని మాత్రమేనని అన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై రామ్‌గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో వర్మ స్పందించారు. పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ సినిమాలు తీసుకునేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story