Ram Gopal Varma: "నన్ను గే అనుకుంటారు" అంటున్న ఆర్జీవీ

Ram Gopal Varma: టాలీవుడ్ లోని స్టార్ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు.

admin1
Updated on: 30 Aug 2021 8:57 PM IST
Ram Gopal Varma Commets on Megha Akash
X

Ram Gopal Varma: "నన్ను గే అనుకుంటారు" అంటున్న ఆర్జీవీ

Ram Gopal Varma: టాలీవుడ్ లోని స్టార్ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. వివాదాస్పద కామెంట్లు చేయాలంటే వర్మ తర్వాతే ఎవరైనా. అదేంటో వర్మ ఏం మాట్లాడినా అది సెన్సేషనల్ అవుతుంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ తనకు తోచింది మాట్లాడి చాలా సార్లు వివాదాలకు కారణం అయ్యారు. తాజాగా మరొకసారి వివాదాస్పద కామెంట్లతో ఆయన పేరు నెట్లో మెరిసింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ 'డియర్‌ మేఘ' అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. సినిమా హీరో మరియు హీరోయిన్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వర్మ. అర్జున్‌ దాస్యన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మేఘ ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ బాగుందని ఇలాంటి రొమాంటిక్ సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని అన్నారు. హీరోయిన్ గురించి మాట్లాడుతూ, "ఈ అమ్మాయి చాలా స్వీట్ అని, ఈమెను కలిసిన వారికి డయాబెటిస్ వస్తుంది. 40 సంవత్సరాల క్రితం ఇలాంటి అమ్మాయిని కలిసి ఉంటే ఇప్పుడు నేను ఇలాగా ఉండే వాడిని కాదు" అంటూ వర్మ షాకిచ్చాడు. ఇక హీరో గురించి ఎక్కువ మాట్లాడితే తనను అందరూ గే అనుకుంటారని కానీ త్వరలోనే తనతో ఓ సినిమా తీస్తానని రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

admin1

admin1

Next Story