
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి వార్తలోకి నిలిచారు. మొన్న ట్రంప్ భారత పర్యటనపై ట్విట్ చేసిన రాంగోపాల్ వర్మ.
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి వార్తలోకి నిలిచారు. మొన్న ట్రంప్ భారత పర్యటనపై ట్విట్ చేసిన రాంగోపాల్ వర్మ. ఈ సారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'పై ట్విట్ చేశారు. పవర్ స్టార్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌పై స్పందిస్తూ.. I don't think some idiot did not do this non idiotic thing 'నేను కొంత మంది ఇడియట్స్ విషయం గురించి ఆలోచించను. ఇలాంటి ఇడియట్స్ పనులను నేను చేయను' అంటూ వకీల్ సాబ్ పోస్టర్‌కు తన పొస్టర్ జత చేస్తూ వర్మ కామెంట్స్ చేశారు.
అయితే.. వర్మ జత చేసిన పొస్టర్ చూస్తే పవన్ పోస్టర్ పవన్ కూర్చున్న స్టైల్‌లోనే పైన వర్మ కూర్చుని 'డైరెక్టర్ సాబ్' అనే టైటిల్ ఇవ్వడం గమనార్హం. కాగా.. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్‌సాబ్'. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ విడుదల కావడంతో అభిమానులు, పలువురు సినీ ప్రముఖలు స్పందించారు. రెండేళ్లు క్రితం పవన్ చివరిగా 2018లో 'అజ్ఞాతవాసి'లో నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.
I don't think some idiot did not do this non idiotic thing pic.twitter.com/MCfgyKMM3W
— Ram Gopal Varma (@RGVzoomin) March 2, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




