Ram Gopal Varma: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై వర్మ వెరైటీ కామెంట్స్!

Ram Gopal Varma: వివాదాస్పద డైరక్టర్ రాం గోపాల్ వర్మ ఈసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంపై పడ్డారు.

Arun Chilukuri
Updated on: 11 Nov 2020 8:00 PM IST
Ram Gopal Varma
X

Ram Gopal Varma

వివాదాస్పద డైరక్టర్ రాం గోపాల్ వర్మ ఈసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంపై పడ్డారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ పై తనకు ఆసక్తి లేదని తనకు బురద అన్నా, మొక్కలన్నా పడదనీ ట్వీట్ చేశాడు. తాను చాలా స్వార్ధపరుడినని మొక్కల విషయంలో తనకన్నా నిస్వార్ధంగా సేవ చేసే వారే ఉత్తమమని అందుకే ఛాలెంజ్ లపై ఆసక్తి ఉండదనీ ట్వీట్ చేశాడు.

మరోవైపు ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ట్రిపుల్ ఆర్ టీమ్ మొక్కలు నాటింది, ఆ పై ఆచార్య, రాధే శ్యామ్, పుష్ప టీమ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరింది. ఎంతో ఉత్సాహంగా సాగుతున్న ఈ ఉద్యమంపై వర్మ చేసిన కామెంట్లు వివాదంగా మారుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story