Ram Gopal Varma Biopic: తెరకెక్కనున్న రామ్ గోపాల్ వర్మ బయోపిక్.. దర్శకుడు ఎవరో తెలుసా?

Ram Gopal Varma Biopic: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే..

S. Srikanth
Published on: 26 Aug 2020 10:26 AM IST
Ram Gopal Varma Biopic: తెరకెక్కనున్న రామ్ గోపాల్ వర్మ బయోపిక్.. దర్శకుడు ఎవరో తెలుసా?
X

Ram Gopal Varma (File Photo)

Ram Gopal Varma Biopic: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మియా మల్కోవాతో క్లైమాక్స్, కరోనా వైరస్, నగ్నం వంటి సినిమాలను విడుదల చేసిన వర్మ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ ప్రేమ కథని సినిమాగా తీయనున్నట్లుగా ప్రకటించాడు. దీనికి 'మర్డర్' అనేది టైటిల్ కాగా 'కుటుంబ కథా చిత్రమ్' అనేది ట్యాగ్‌లైన్..

మర్డర్ సినిమా పైన ప్రణయ్ భార్య అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది.. అంతేకాకుండా నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించింది. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ వర్మ సినిమాని నిర్మించడాని అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపైన తాజాగా విచారణ చేపట్టిన కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే..

అయితే, త్వరలో రామ్ గోపాల్ వర్మ బయోపిక్ రానుంది. తన బయోపిక్ ను తెరిక్కేస్తుంది ఎవరోకాదు.. స్వయంగా అర్జీవీయే. తన బయోపిక్ ను మూడు భాగాలుగా, మూడు సినిమాలుగా తెరకేక్కిస్తునట్లు అర్జీవీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ సినిమాను తన అధ్వర్యంలో దొరసాయి తేజ్ అనే నూతన దర్శకుడు తెరక్కిస్తున్నాడని, బొమ్మాకు మురళి ఈ సినిమాను నిర్మించనున్నారు. అంతే కాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అర్జీవీ ట్వీట్ ద్వారా తెలిపారు.





S. Srikanth

S. Srikanth

Next Story