logo
సినిమా

Ram Gopal Varma: కొండా ‌ఫ్యామిలీ మూలాన ఇదీ నా పరిస్థితి

Ram Gopal Varma and Konda Surekha Kanaka Durga Temple Visited
X

దుర్గమ్మ సేవలో ఆర్జీవీ సహా సురేఖ బంధువర్గం

Highlights

*దుర్గమ్మ సేవలో ఆర్జీవీ సహా సురేఖ బంధువర్గం

Konda Movie Team: కొండా మురళి జీవితంపై రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా దాదాపుగా పూర్తయిపోయింది. అయితే విడుదలకు ముందు కొండా సురేఖ త‌న కుటుంబంతో పాటు చిత్ర బృందాన్ని వెంట‌బెట్టుకుని బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే కొండా ఫ్యామిలీ అభ్య‌ర్థ‌న మేర‌కు రాంగోపాల్ వ‌ర్మ కూడా క‌న‌క‌దుర్గ‌ను ద‌ర్శించుకున్నారు.

ఆల‌యంలో కొండా సురేఖ పక్క‌నే వ‌ర్మ కూర్చొని పూజలో పాల్గొనడం విశేషం. ఆ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన వ‌ర్మ‌ 'కొండా ఫ్యామిలీ మూలాన ఇదీ నా ప‌రిస్థితి' అంటూ ఓ కామెంట్‌ను కూడా జ‌త చేశారు. వర్మకు పూజలన్నా, దైవ దర్శనాలన్నా గిట్టవు. దీంతో ఆయన ఇలా కామెంట్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

Web TitleRam Gopal Varma and Konda Surekha Kanaka Durga Temple Visited
Next Story