RGV: ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్జీవీ 10 ప్ర‌శ్న‌లు.. వ‌ర్మ‌కు మెగా బ్ర‌ద‌ర్ మ‌ద్ద‌తు..

RGV: టికెట్‌ రేట్స్ ఇష్యూ మీద రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో విరుచుకపడుతున్నారు.

Arun Chilukuri
Published on: 4 Jan 2022 8:20 PM IST
Ram Gopal Varma 10 Questions to ap Government Naga Babu Supports RGV
X

RGV: ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్జీవీ 10 ప్ర‌శ్న‌లు.. వ‌ర్మ‌కు మెగా బ్ర‌ద‌ర్ మ‌ద్ద‌తు..

RGV: టికెట్‌ రేట్స్ ఇష్యూ మీద రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో విరుచుకపడుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి, మంత్రులకు ట్విట్టర్‌లో ప్రశ్నలు సంధించి పరేషాను చేశారు. లేటెస్ట్‌గా యూట్యూబ్ లో ప్రత్యేక్షమై మరో 10 ప్రశ్నలు వదిలారు. ప్రభుత్వాన్ని ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారా? అంటూనే ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ప్రభుత్వమే తక్కువ ధరకు సినిమా తీయచ్చు కదా అంటూ సెటైర్ వేశారు. కావాలంటే రేషన్‌ థియేటర్స్‌ ఓపెన్‌ చేసుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చేశాడు. మీకు అర్థం కావడం లేదా? మాకు అర్థం అయ్యేటట్టు చెప్పలేక పోతున్నారా అంటూ ఈ సారీ స్ట్రాంగ్‌ గానే రియాక్ట్‌ అయ్యారు వర్మ.

ఆర్జీవీని మెగా బ్రదర్‌ నాగబాబు సపోర్ట్ చేశారు. ఆర్జీవీ అడిగిన 10 ప్రశ్నల పై మెగా బ్రదర్ రియాక్ట్ అయ్యారు. ఆర్జీవీ అడిగిన ప్రశ్నలన్నీ సత్యాలే.. తాను అడగాలనుకున్న ప్రశ్నలు మీనోటి ద్వారా బయటకు వచ్చాయి అంటూ ట్వీట్‌ చేశారు. మరి ఇప్పుడు నాగబాబు ట్వీట్ పై ఏపీ మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story