అల్లు అర్జున్ పై కన్నేసిన తమిళ స్టార్ డైరెక్టర్

Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న రామ్ డైరెక్టర్

Arun Chilukuri
Updated on: 14 July 2022 8:06 AM IST
Ram Director Trying to Make a Film With Allu Arjun
X

అల్లు అర్జున్ పై కన్నేసిన తమిళ స్టార్ డైరెక్టర్

Allu Arjun: ఈ మధ్యకాలంలో స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెలుగు హీరోలపై కన్నేసిన సంగతి తెలిసిందే. తాజా గాజువాక హీరో రామ్ తో "ది వారియర్" సినిమా చేస్తున్న లింగస్వామి తాజాగా ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరో తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లింగుస్వామి తన తదుపరి ప్రాజెక్టుల గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. బన్నీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటానని కథల గురించి మాట్లాడతామని చెప్పారు లింగుస్వామి.

"15 రోజులు క్రితమే బన్నీని కలిసి మాట్లాడాను. మా ఇద్దరి కాంబినేషన్లో ఖచ్చితంగా సినిమా వస్తుంది," అని చెప్పారు లింగుస్వామి. మాస్ ఇమేజ్ ఉన్న లింగు స్వామి డైరెక్షన్లో బన్నీ సినిమా చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు "పుష్ప: ది రూల్" సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరే సినిమాకి సైన్ చేయలేదు. కానీ ప్రస్తుతం ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేని లింగు స్వామి మాత్రం "వారియర్" పైన తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా కనుక మంచి విజయాన్ని సాధిస్తే బన్నీ లింగుస్వామితో సినిమా చేసేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story