"అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను" అంటున్న ఉపాసన

Ruthvik
Published on: 11 March 2019 11:03 AM IST
అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను అంటున్న ఉపాసన
X

రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాక అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప రెడ్డి గారి మనవరాలిగా ఉపాసన కామినేని కొణిదెల అందరికీ తెలుసు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె ప్రొఫెషన్ మరియు పర్సనల్ లైఫ్ గురించి బోలెడు విషయాలు పంచుకున్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన తనకు అమ్మమ్మ తాతయ్యలతో మంచి అనుబంధం ఉందని తెలిపారు ఉపాసన. ఇక బరువు గురించి మాట్లాడుతూ, కాలేజి రోజులలో వెయిట్ ఎక్కువగా ఉండేదానినని, దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు.

అప్పటినుండి ప్రొఫెషన్, ఫ్యామిలీ కాకుండా తన మొదటి ప్రయారిటీ ఆరోగ్యానికే ఇచ్చానని చెప్పారు. కాలేజి చదువు పూర్తయిన తర్వాత 'బీ పాజిటివ్' మ్యాగజైన్ ను ప్రారంభించానని, అప్పటి నుంచి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోల రూపంలో ఫిట్నెస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు సైతం చేస్తున్నానని చెప్పారు. ఇక చరణ్ ను వివాహం చేసుకోవడం తన జీవితంలో జరిగిన బెస్ట్ థింగ్స్ లో ఒకటని, తనను చాలా బాగా చూసుకుంటారని చెప్పిన ఉపాసన చిరంజీవి చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పారు.

Ruthvik

Ruthvik

Next Story