శంకర్ తో సినిమా పై ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టిన రామ్ చరణ్

శంకర్ తో సినిమా పై ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టిన రామ్ చరణ్
*శంకర్ తో సినిమా పై ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టిన రామ్ చరణ్
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా రాజమౌళి దర్శకత్వంలో మార్చి 25 న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది.
స్టార్ కోలీవుడ్ నటుడు ఎస్.జె.సూర్య కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు రామ్ చరణ్. "ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి 60 రోజుల షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో నేను విభిన్న లుక్స్ తో కనిపించబోతున్నాను.
ఇది ఒక హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామా. ఇందులో నేను ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాను" అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. దిల్ రాజు మరియు శిరీష నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ ప్రేక్షకులను ఎంతవరకూ అలరిస్తారో వేచి చూడాలి.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Hyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా..!
26 Jun 2022 8:19 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTహైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMTMekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMT