Ram Charan: ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎంతో తెలుసా?

Ram Charan: 40 నిమిషాల పాటు తెర ఫై కనిపించనున్న రామ్ చరణ్

admin1
Updated on: 31 March 2022 10:01 AM IST
Ram Charan Will Appear on Screen for 40 Minutes in Acharya Movie
X

Ram Charan: ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎంతో తెలుసా?

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు కాగా అందులో చిరంజీవితో 20 నుంచి 25 నిమిషాల దాకా సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించనుంది. కరోనా కారణంగా ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాని ఏప్రిల్ 29న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిత్ర షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. రామ్ చరణ్ మరియు చిరంజీవి తమ తదుపరి సినిమాలతో బిజీ అయిపోయారు. కొరటాల శివ కూడా ఎన్టీఆర్ తో తన సినిమాని మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ను చిత్రబృందం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story