Ram Charan: రామ్ చరణ్‌ దంపతులకు ‘అయోధ్య’కు ఆహ్వానం

Ram Charan: ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవికి కూడా ఆహ్వానం

Shekhar G
Published on: 13 Jan 2024 3:46 PM IST
Ram Charan & wife Upasana Kamineni invited to attend the consecration ceremony of Ram Mandir
X

Ram Charan: రామ్ చరణ్‌ దంపతులకు ‘అయోధ్య’కు ఆహ్వానం

Ram Charan: అయోధ్యలో జనవరి 22న ప్రారంభం కానున్న రామాలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికీ సినీ, రాజకీయ, కళాకారులు, సాధువులు ఇలా దేశ ప్రముఖుల అందరికీ పెద్ద ఎత్తున ఆహ్వానాలు అందాయి. లేటెస్ట్గా మెగా రామ్ చరణ్ దంపతులకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం అందింది. ఆరెస్సెస్‌ నేత సునీల్‌ అంబేద్కర్‌..హైదరాబాద్‌లోని రామ్‌చరణ్‌ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది.

ఇపుడు చరణ్ కి కూడా ఆహ్వానం అందడంతో..మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీల నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్‌, చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, కంగనా రనౌత్‌, జాకీ ష్రాఫ్‌, టైగర్‌ ష్రాఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌..తదితరులకు ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి.

Shekhar G

Shekhar G

Next Story