Ram Charan: "ఆర్ఆర్ఆర్" తర్వాత కూడా రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలా?

Ram Charan: "ఆర్ఆర్ఆర్" తర్వాత కూడా రామ్ చరణ్ క్రేజ్ పై ఫాన్స్ అభిమానాలు

Dhatripriya
Updated on: 24 March 2023 7:30 PM IST
Ram Charan Wants Pawan Kalyan Support Even After RRR Movie
X

Ram Charan: "ఆర్ఆర్ఆర్" తర్వాత కూడా రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలా?

Ram Charan: ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ లో ట్రెండు చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా వరకు స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్ళీ థియేటర్లలో విడుదలై రికార్డులు సృష్టించాయి. పోకిరి, ఒక్కడు ఖుషి, జల్సా, నరసింహనాయుడు, బిల్లా, ఘరానా మొగుడు వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యి మళ్లీ మంచి కలెక్షన్లను అందుకున్నాయి. తాజాగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటైన "ఆరెంజ్" సినిమా రీ రిలీజ్ అవుతుంది.

మార్చ్ 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులలో సైతం పలు అనుమానాలు మొదలయ్యాయి. చాలా వరకు రీ రిలీజ్ అయిన సినిమాలకి వచ్చే కలెక్షన్లు చారిటీకి వెళుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా అభిమానులను తన రీ రిలీజ్ అయిన తన సినిమాలను చూడమని కోరారు. ఇక అలా వచ్చిన కలెక్షన్లు జనసేన ఫండ్ కి వెళ్ళాయి.

తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ మరియు నాగబాబు కూడా "ఆరెంజ్" సినిమాని చూడమని ప్రమోషన్లు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ కోసం కూడా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన కి సపోర్ట్ చేయడానికి అభిమానులు సినిమా చూశారు అని చెప్పుకోవచ్చు. కానీ రామ్ చరణ్ కి అలాంటి ఫ్యాక్టర్లు ఏమి వర్కౌట్ అవ్వవు. కానీ ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమా "నాటు నాటు" పాటకి గాను ఆస్కార్ కూడా సాధించి చిత్ర బృందంతో పాటు రామ్ చరణ్ పేరు కూడా మారుమ్రోగేలా చేసింది. ఇంత పెద్ద సక్సెస్ వచ్చినప్పటికి కూడా రామ్ చరణ్ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందా లేదా అని అభిమానులలో కూడా అనుమానాలు ఉన్నాయా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story