ఇంద్రకీలాద్రిపై రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ రచ్చ.. ఆలయంలో తొక్కిసలాట..

Indrakeeladri Temple: బెజవాడ కనకదుర్గమ్మవారిని మెగాపవర్ స్టార్ రాంచరణ్ దర్శించుకున్నారు.

Arun Chilukuri
Updated on: 27 April 2022 4:45 PM IST
Ram Charan Visits Indrakeeladri Temple
X

ఇంద్రకీలాద్రిపై రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ రచ్చ.. ఆలయంలో తొక్కిసలాట..

Indrakeeladri Temple: బెజవాడ కనకదుర్గమ్మవారిని మెగాపవర్ స్టార్ రాంచరణ్ దర్శించుకున్నారు. చరణ్‌తో పాటు ఆచార్య చిత్రం డైరెక్టర్ కొరటాల శివ, చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చిత్ర బృందానికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హీరో రాంచరణ్‌ను చూసేందుకు అభిమానులు, అక్కడే ఉన్న భక్తులు ఆసక్తి చూపడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేస్తూ మొబైల్‌ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. పోలీసులు, ఆలయ అధికారుల వారిని అదుపుచేయలేకపోవడంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారింది. ఈనెల 29న విడుదల అవుతున్న ఆచార్య చిత్రం ఘన విజయం సాధించేందుకు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story