Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన మూడో హీరోగా గుర్తింపు..!

Ram Charan Unveils Wax Statue with Pet Dog Rhyme
x

Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన మూడో హీరోగా గుర్తింపు..!

Highlights

Ram Charan: లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చిరంజీవి ఫ్యామిలీతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్. ఫుల్ డిటెయిల్స్ తెలుసుకోండి!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో (Madame Tussauds London) రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ విగ్రహాలు టుస్సాడ్స్‌లో ఉండగా… ఇప్పుడు టాలీవుడ్ నుండి మూడో స్టార్‌గా రామ్ చరణ్ చేరాడు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, చిన్నారి క్లీన్ కార హాజరయ్యారు. ప్రత్యేకంగా చరణ్‌ తన పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చుని ఉన్నట్టుగా ఈ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. రామ్ చరణ్ స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.

ఆవిష్కరణ వేడుక రోజు పెద్దగా ఫొటోలు బయటకు రాకపోయినా తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ మైనపు విగ్రహంతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై మెగా ఫ్యాన్స్ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఎంతో రియలిస్టిక్‌గా కనిపిస్తుండటంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాల తర్వాత రామ్ చరణ్ కు ఈ గౌరవం దక్కింది. ఇక మున్ముందు మరిన్ని టాలీవుడ్ హీరోలు టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories