రామ్ చరణ్ శంకర్ సినిమాలో అలాంటి పాత్ర కూడా ఉండబోతుందా?

RC 15: రామ్ చరణ్ శంకర్ సినిమాలో కనిపించనున్న ఫ్రీడమ్ ఫైటర్

Jyothi
Updated on: 26 Oct 2022 3:22 PM IST
Ram Charan to play a dual role
X

రామ్ చరణ్ శంకర్ సినిమాలో అలాంటి పాత్ర కూడా ఉండబోతుందా?

RC 15: రామ్ చరణ్ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఒకవైపు సినిమా అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మరొకవైపు సినిమాకి సంబంధించి, సినిమా కథ మరియు పాత్రలకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

వివరాల్లోకి వెళితే ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు అనే వార్త ఇప్పటికే బయటకు వచ్చేసింది .రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో రామ్ చరణ్ తండ్రి పాత్రలో మాత్రమే కాక కొడుకు పాత్రలో కూడా కనిపించబోతున్నారు. తండ్రి పాత్ర రామ్ చరణ్ రామచంద్రన్ అనే ఒక పొలిటికల్ లీడర్ ది కాగా కొడుకు పాత్ర ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ ది అని సమాచారం.

అయితే ఈ సినిమాలో తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్ అలియాస్ నేతాజీ కి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ ఉంటాయట. మరి నేతాజీ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అని కూడా ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. తండ్రి రామ్ చరణ్ తండ్రి పాత్రకు అంజలి హీరోయిన్ గా నటిస్తూ కొడుకు రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కనిపించనుంది.

Jyothi

Jyothi

Next Story