Ram Charan: నెట్ ఫ్లిక్స్ లో అడుగు పెట్టనున్న రామ్ చరణ్

Ram Charan: ఓటీటీలో అడుగుపెట్టనున్న మెగా పవర్ స్టార్

Rama Rao
Published on: 15 Feb 2022 5:08 PM IST
Ram Charan to Make his Prestigious Project Debut on Netflix
X

నెట్ ఫ్లిక్స్ లో అడుగు పెట్టనున్న రామ్ చరణ్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". ఎప్పుడో జనవరి లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు మార్చి 25 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ సినిమాకి తెలుగులో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ కి ఒక ఆసక్తికరమైన ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే అది తొందర్లోనే రామ్ చరణ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ నెట్ఫ్లిక్స్ వారు విడుదల చేయనున్న ఒక రీమేక్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ వెబ్ సిరీస్ ను తెలుగులో రీమేక్ చేయబోతుండగా, అందులో ఒక బాలీవుడ్ స్టార్ ని హీరోగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే సౌత్ ఇండియా లో కూడా క్రేజ్ కోసం స్టార్ హీరో రామ్ చరణ్ ని రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించి కొన్ని భారీ సెట్ అప్ లు మరియు లొకేషన్లను వెతికే పనిలో ఈ వెబ్ సిరీస్ బృందం బిజీగా ఉంది. ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story