Ram Charan: అభిమానులకు ధన్యావాదాలు తెలిపిన రామ్ చరణ్

Ram Charan: కరోనా సంక్షోభంలో అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్ధుడయ్యారు.

Arun Chilukuri
Published on: 6 Jun 2021 9:40 AM IST
Ram Charan Thanks Fans for Helping Affected People During Corona Pandemic
X

రామ్ చరణ్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Ram Charan: కరోనా సంక్షోభంలో అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్ధుడయ్యారు. అభిమానుల అంకిత భావానికి ధన్మవాదాలు అంటూ సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు. తన అభిమానులు కోవిడ్ సమయంలో ప్రజలకు సేవచేయడాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వస్తున్నానని వివరించారు. మెగా అభిమానుల సేవాకార్యక్రమాల ఫొటోలతో కూడిన ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ పంచుకున్నారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన వారికి ఆక్సిజన్‌ అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను రామ్‌చరణ్‌ పర్యవేక్షిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story