రవితేజ 'క్రాక్' మూవీపై రామ్‌చరణ్ ఆసక్తికర ట్వీట్‌..

మాస్‌రాజా ర‌వితేజ, గోపీచంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘క్రాక్‌’.

Samba Siva Rao
Published on: 13 Jan 2021 8:42 PM IST
రవితేజ క్రాక్ మూవీపై రామ్‌చరణ్ ఆసక్తికర ట్వీట్‌..
X

మాస్‌రాజా ర‌వితేజ, గోపీచంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం 'క్రాక్‌'. ఈ సినిమా ఈనెల 9 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమాపై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రశంసలు కురిపించారు. సినిమాను చాలా బాగా ఎంజాయ్‌ చేశానంటూ కితాబిచ్చారు. తన అభిమాన నటుడు రవితేజ ప్రస్తుతం టాప్‌ ఫాంలో ఉన్నారన్నారు. హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ప్రశంసించారు. సముద్రఖని, వరలక్ష్మీశరత్‌ కుమార్‌ తమ నటనతో అదరగొట్టారన్నారు . థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని, డైరెక్టర్ గోపిచంద్ ఈ మూవీని తెరకెక్కించిన విధానం అద్భుతం అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

కొన్నికారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయినా.. బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ర‌వితేజ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌ కూడా ఈ సినిమా గురించి సానుకూలంగా స్పందించడంతో థాంక్స్‌ అన్నా అంటూ అభిమానం చాటుకుంటున్నారు. కాగా సినిమా రిలీజ్‌కు ముందు మెగా కాంపౌండ్‌ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కూడా రవితేజకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ ట్వీట్ పై స్పందించిన తమన్‌, మూవీ దర్శకుడు గోపిచంద్‌ మలినేని చెర్రీకి ధన్యవాదాలు తెలిపారు. క్రాక్‌ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి బహుమతి అందించామని, ఇందుకు గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story