మళ్లీ అదే దర్శకుడితో పని చేయనున్న మెగా పవర్ స్టార్ ?

Ruthvik
Published on: 13 April 2019 1:35 PM IST
మళ్లీ అదే దర్శకుడితో పని చేయనున్న మెగా పవర్ స్టార్ ?
X

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం అయిన 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ షూటింగ్ డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తయిపోతుంది అని తెలుస్తుంది. మరి చెర్రీ తదుపరి సినిమా ఏంటి అనే విషయంపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

తాజా సమాచారం ప్రకారం 'మహర్షి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న వంశీ పైడిపల్లి ఈ మధ్యనే రామ్ చరణ్ ని కలిసి ఒక మంచి కథను వినిపించాడట. స్టోరీ లైన్ నచ్చడంతో రామ్ చరణ్ వంశీ పైడిపల్లిని ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని అడిగాడట. అన్నీ కుదిరితే రామ్ చరణ్ తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే దాని కంటే ముందు ఈ ఫుల్ స్క్రిప్ట్ విన్నాక రామ్ చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడో 2014లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ 'ఎవడు' అనే సినిమాలో నటించాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుందో లేదో చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story