Ram Charan: సందీప్ వంగాకు మెగా క‌పుల్ స‌ర్‌ప్రైజ్‌.. ఏంటా గిఫ్ట్‌? ఎందుకిచ్చారు?

Ram Charan: సందీప్ వంగాకు మెగా క‌పుల్ స‌ర్‌ప్రైజ్‌.. ఏంటా గిఫ్ట్‌? ఎందుకిచ్చారు?
x
Highlights

Ram Charan: కేవ‌లం రెండు సినిమాల‌తోనే సెన్సేష‌న్ డైరెక్ట‌ర్‌గా మారారు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ మూవీస్‌తో ఇండ‌స్ట్రీని షేక్ చేసిన సందీప్ తాజాగా రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టిస్తున్న ‘స్పిరిట్’ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

కాగా తాజాగా స్పిరిట్‌లో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఎంపికైనట్టు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్‌ బ్యూటీ త్రిప్తి, ఇటీవల యానిమల్ చిత్రంలో తన గ్లామర్‌, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె ప్రభాస్ సరసన నటించనుందన్న వార్తతో టాలీవుడ్‌ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.

ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన పంపిన ప్రత్యేకమైన బహుమతిని ఆయన అభిమానులతో పంచుకున్నారు. వారి ప్రేమతో కూడిన బహుమతి అందుకున్న సందీప్ రెడ్డి వారిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ర‌న్ చేస్తున్న అత్త‌మ్మాస్ కిచెన్ తయారుచేసిన ఆవకాయ పచ్చడిని సందీప్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనిని ప్రత్యేకంగా సందీప్ కోసం జాడీలో పంపించారు. ఈ చిన్న కానుక అభిమానులను ఆకట్టుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories