Ram Charan: రీమేక్ సినిమాలపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: రీమేక్ సినిమాలపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

Arun Chilukuri
Published on: 22 Nov 2022 7:05 PM IST
Ram Charan Shocking Comments on Remake Movies
X

Ram Charan: రీమేక్ సినిమాలపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ సినిమాల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఓటీటీ కాలంలో రీమేక్ సినిమాలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వేరే భాషలో ఉన్న సినిమాని ఓటీటీ లలో చూసేసిన ప్రేక్షకులు మళ్లీ అదే సినిమాని థియేటర్లలో చూడటానికి ఇష్టపడరని అన్న రామ్ చరణ్ స్టార్ హీరోలు రీమేక్ సినిమాలు చేస్తే మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారని అన్నారు.

ఇక మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా రీమేక్ సినిమాలు వచ్చాయి. ఆఖరికి చిరంజీవి ఈ మధ్యనే నటించిన "గాడ్ ఫాదర్" సినిమా కూడా మలయాళం సినిమా "లూసిఫర్" కి రీమెకే. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య రెండు రీమేక్ సినిమాలు చేశారు. ఫాన్స్ కూడా రీమేక్ సినిమాలను ఎంకరేజ్ చేయటం లేదని చెప్పుకోవచ్చు. మిగతా సినిమాలతో పోలిస్తే రీమేక్ సినిమాలకి ఓపెనింగ్ కలెక్షన్లు తక్కువగానే ఉంటున్నాయి.

బజ్ ఉన్నప్పటికీ గాడ్ ఫాదర్ కి మంచి ఓపెనింగ్స్ రాలేదు. "లూసిఫర్‌" ను ఇంతకు ముందే చాలా మంది OTTలో చూసేసారు. రీమేక్‌ లలో చాలా వరకు ఒరిజినల్‌లో ఉండే ఫీల్ పోతుంది అని చెప్పచ్చు. ఒరిజినల్‌ కంటే రీమేక్‌ బావుంది అని కొన్ని సందర్భాల్లో విన్నాం కానీ అది రిస్క్‌తో కూడుకున్నది. పైగా ఒరిజినల్ సినిమా OTTలో ఉచితంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి రీమేక్ సినిమాలకు డబ్బులు ఖర్చుపెట్టి థియేటర్ లకు వెళ్ళడానికి ప్రేక్షకులు అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story