RamCharan suprises to Jani Master: జానీ మాస్టర్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్.. మిమ్మల్ని మరచిపోలేను అన్నా అంటూ భావోద్వేగం

RamCharan suprises to Jani Master: టాలీవుడ్లో మోస్ట్ బిజీ అండ్ టాలెంటెడ్ కోరియోగ్రఫర్ జానీ మాస్టర్.. నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాతో డాన్సర్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు జానీ మాస్టర్

Krishna
Published on: 3 July 2020 7:10 AM IST
RamCharan suprises to Jani Master: జానీ మాస్టర్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్.. మిమ్మల్ని మరచిపోలేను అన్నా అంటూ భావోద్వేగం
X

RamCharan suprises to Jani Master: టాలీవుడ్లో మోస్ట్ బిజీ అండ్ టాలెంటెడ్ కోరియోగ్రఫర్ జానీ మాస్టర్.. నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాతో డాన్సర్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు జానీ మాస్టర్.. ఇక ప్రేమ కావాలి, రచ్చ, ఇద్దరమ్మాయిలతో మొదలగు సినిమాలకి కోరియోగ్రఫర్ గా పనిచేసి మంచి ఫేం సంపాదించుకున్నారు. ఈరోజు (జూలై 2) మాస్టర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సర్ ప్రైజ్ వీడియోను విడుదల చేశారు..

ఇందులో చరణ్.. జానీ మాస్టర్ గురించి మాట్లడుతూ.. హాయ్.. జానీ మనం కలిసి చాలా రోజులైంది. ఈ లాక్ డౌన్ తరువాత మనం అంతా కలిసి మంచి మంచి సాంగ్స్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా.. మీ వైఫ్‌ని అందరినీ అడిగినట్టు చెప్పు.. టేక్ కేర్..అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు చరణ్..

అయితే ఈ వీడియోనీ షేర్ చేస్తూ జానీ మాస్టర్ చాలా ఎమోషనల్ అయ్యారు. 'థాంక్యూ సో మచ్ రామ్ చరణ్ అన్నా.. మీతో నా ప్రయాణం స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ నన్ను ఎంతోగానో ప్రోత్సహిస్తు వస్తున్నారు. మీ మేలు ఎప్పటికీ మరువలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు జానీ మాస్టర్..

ఇక రామ్ చరణ్ నటించిన చాలా సినిమాలకి జానీ మాస్టర్ కోరియోగ్రఫీ అందించారు. ముఖ్యంగా జిగేల్ రాణి (రంగస్థలం).. డిల్లకు డిల్లకు (రచ్చ).. లైలా ఓ లైలా (నాయక్).. ఫ్రీడమ్ (ఎవడు) సాంగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది.


Krishna

Krishna

Next Story