"నా కల నెరవేరింది" అంటున్న రామ్ చరణ్

Ram Charan: "నేనెప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాను" అంటున్న మెగాపవర్స్టార్

admin1
Updated on: 6 April 2022 12:44 PM IST
Ram Charan Says My Dream Has Come True | Tollywood News
X

"నా కల నెరవేరింది" అంటున్న రామ్ చరణ్

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి అతి త్వరలోనే "ఆచార్య" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రామ్ చరణ్ నటించిన మగధీర, రచ్చ వంటి సినిమాల్లో చిరంజీవి క్యామియో పాత్రల్లో కనిపించారు తప్ప కీలక పాత్రలో కనిపించింది లేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. "నేను ఒక సహా నటుడిగా కంటే ఒక శిష్యుడిగా ఈ సినిమాలో చేరాను. ఇది నిజంగా నా కల. నాన్నగారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన ఎప్పుడూ నన్ను కోప్పడలేదు.

దానికి నేను ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో కనిపించబోతున్నారు. చెర్రీ మరియు చిరు లు కలిసి దాదాపు 25 నిమిషాల పాటు వెండితెరపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక నటుడిగా మాత్రమే కాక రామ్ చరణ్ ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story