Ram Charan - RC15: శంకర్ సినిమా గురించి చెబుతున్న రామ్ చరణ్

శంకర్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అంటున్నా రామ్ చరణ్

admin1
Updated on: 1 Dec 2021 5:36 PM IST
Ram Charan Says in an interview He is Very Happy to Work With S Shankar in RC15 Movie
X

శంకర్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అంటున్నా రామ్ చరణ్ ( ఫోటో: ది హన్స్ ఇండియా)

Ram Charan - S Shankar (RC15 Movie): ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాని అభిమానులు #RC15 అని పిలుచుకుంటున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఒక రాజకీయనాయకుడు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

"తెర మీద అయిన సినిమాలు చూసి ఇష్టపడతాం. ఇప్పుడు ఆయనతోనే కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగా కంటే ఒక ఫ్యాన్ బాయ్ లాగా నేను సెట్లో ఉండేవాడిని. ప్రతి పాత్రలోనూ స్క్రిప్టు లోనూ ఆయన కనిపిస్తుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని రామ్ చరణ్. శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కియర అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story