Ram Charan : సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గదు అంటున్న రామ్ చరణ్

ఆచార్య సినిమాలో తన పాత్ర ఇదే అంటున్న రామ్ చరణ్

admin1
Updated on: 1 Dec 2021 4:36 PM IST
Ram Charan Says About His Role in Acharya Movie | Tollywood News Today
X

Ram Charan : సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గదు అంటున్న రామ్ చరణ్

Acharya Movie - Ram Charan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, పూజా హెగ్డే రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో తన పాత్ర గుర్తించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఇలా అన్నారు. "నా పాత్ర ఈ సినిమాలో 40 నిమిషాలు పాటు ఉంటుంది. దాదాపు సెకండ్ హాఫ్ మొత్తం నా పాత్ర కనిపిస్తూ ఉంటుంది. గెస్ట్ అప్పియరెన్స్ గా మొదలైన నా పాత్ర ఇప్పుడు సినిమాలో ముఖ్య భాగం అయిపోయింది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కొరటాల గారు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పాత్ర చాలా రియలిస్టిక్గా పర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉండే విధంగా ఉంటుంది. మా ఇద్దరి పాత్రలు ఎలా ఉంటే బాగుంటుంది అని అభిమానులు ఆశిస్తారో ఖచ్చితంగా ఈ సినిమా అలానే ఉంటుంది" అని అన్నారు రామ్ చరణ్.

admin1

admin1

Next Story