ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గించేశారా?

ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గించేశారా?

admin1
Updated on: 15 April 2022 12:01 PM IST
Ram Charan Role in Acharya Movie Been Reduced in Length
X

ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గించేశారా?

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు కాగా అందులో చిరంజీవితో 20 నుంచి 25 నిమిషాల దాకా సన్నివేశాలు ఉంటాయని వార్తలు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ని కొంచెం ట్రిమ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైం బాగా ఎక్కువగా అయిపోతూ ఉండడంతో రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గించేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం ఒక ఎక్స్టెండెడ్ క్యమియో పాత్రగా మాత్రమే ఉండబోతోందని తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించనుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story