Acharya: ఆచార్య లో అదే హైలెట్ అంటున్న రామ్ చరణ్...

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతోంది...

Shireesha
Updated on: 28 April 2022 3:30 PM IST
Ram Charan Revealed that Climax is the Highlight of Acharya Movie | Acharya Movie News
X

Acharya: ఆచార్య లో అదే హైలెట్ అంటున్న రామ్ చరణ్...

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలోనే నటీనటులు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను తెలియ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ చెప్పిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీజర్ లో చిరంజీవి శూలంతో కొంతమంది గుండాలను కొట్టే సీన్ క్లైమాక్స్ లో ఉంటుందని ఆ క్లైమాక్స్ సన్నివేశ చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డట్టుగా తెలిపారు రామ్ చరణ్.

అందులోనే ఒక సన్నివేశంలో కుంకుమతో నిండి ఉన్నా ఫ్లోర్ పై కూడా ఒక ఫైట్ సన్నివేశం ఉందని అన్నారు చరణ్. ఇక ఈ క్లైమాక్స్ సీన్ సినిమాకే అతిపెద్ద హైలైట్గా ఉంటుందని, ఇక సినిమా సూపర్ హిట్ అవుతుందని తనకు గట్టి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. దాదాపు కొరటాల సినిమాలు అన్నిటిలోనూ హీరో పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక ఆచార్య సినిమాలు కూడా చిరు పాత్ర అలానే ఉండబోతోందని తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story