Ram Charan: గాడ్ ఫాదర్ కలెక్షన్స్ బయటపెట్టిన రామ్ చరణ్

Ram Charan: ఈమధ్యనే ఢిల్లీ కి వెళ్ళిన రామ్ చరణ్ అక్కడ ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు

Jyothi
Published on: 30 Nov 2022 12:33 PM IST
Ram Charan Revealed Godfather Collections
X

Ram Charan: గాడ్ ఫాదర్ కలెక్షన్స్ బయటపెట్టిన రామ్ చరణ్ 

Ram Charan: చిరంజీవి ఈమధ్యనే మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" సినిమాలో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా కలెక్షన్ల గురించి సోషల్ మీడియా లో బోలెడు పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కలెక్షన్ల గురించి రామ్ చరణ్ సినిమా క్లారిటీ ఇచ్చారు. ఓటీటీ లో ఇప్పటికే సినిమాను చాలా మంది చూసేసినప్పటికీ సినిమా చాలా బాగా వచ్చిందని ఆయన అన్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమా రూ.145 కోట్ల నుంచి రూ.150 కోట్లు వసూలు చేసింది అని అన్నారు. ఈమధ్యనే ఢిల్లీ కి వెళ్ళిన రామ్ చరణ్ అక్కడ ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

''ఈ మధ్యనే నేను గాడ్ ఫాదర్ అనే సినిమాను విడుదల చేశాను. అది లూసిఫర్‌ సినిమా కి రీమేక్‌. ఈ సినిమాని అప్పటికే ఓటీటీలో చాలా మంది చూశారు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.145 కోట్ల నుంచి రూ.150 కోట్లు రాబట్టింది. రీమేక్‌ సినిమాని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. స్టార్ చరిష్మా మరియు స్టార్ పవర్ వల్ల కూడా సినిమా చూసిన వాళ్ళు మళ్లీ థియేటర్లకు రావచ్చు. అయితే ఆ ఫార్ములా ఎప్పుడూ పని చేయదు అని నా అభిప్రాయం. నేను రీమేక్‌లు చేస్తూనే ఉంటానో లేదో నాకు తెలీదు. ఒకవేళ నేను ఏదైనా సినిమాని రీమేక్ చేయాలి అనుకుంటే ఆ ఒరిజినల్ సినిమా నిర్మాతని ఓటీటీలో విడుదల చేయద్దని కోరతాను. ఆ షరతులతో నేను రీమేక్ చేస్తాను. అయిన అందరం ఒరిజినల్ స్క్రిప్ట్‌లను చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాము," అని అన్నారు రామ్ చరణ్.

Jyothi

Jyothi

Next Story