Ram Charan: ఆ డైరెక్టర్ తో సినిమాని క్యాన్సిల్ చేసిన రామ్ చరణ్..

నాని డైరెక్టర్ కి నో చెప్పిన రామ్ చరణ్

Arun Chilukuri
Published on: 30 Aug 2022 4:11 PM IST
Ram Charan Puts Gowtam Tinnanuri Film On Hold
X

Ram Charan: ఆ డైరెక్టర్ తో సినిమాని క్యాన్సిల్ చేసిన రామ్ చరణ్..

Ram Charan: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత శంకర్ రామ్ చరణ్ సినిమాని పక్కకు పెట్టి "భారతీయుడు 2" సినిమా షూటింగ్ పట్టాలెక్కించారు. ఇక త్వరలోనే రామ్ చరణ్ సినిమా కూడా తిరిగి పట్టాలెక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కాకుండా రామ్ చరణ్ "జెర్సీ" ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి సైన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు జరిగేలాగా కనిపించడం లేదు. ఇప్పటికే పలు సార్లు స్క్రిప్ట్ నరెట్ చేసినప్పటికీ రామ్ చరణ్ కు కథ అంతగా నచ్చలేదని అందుకే గౌతమ్ తిన్ననూరితో సినిమాని క్యాన్సిల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక యూవీ క్రియేషన్స్ పతాకంపై రామ్ చరణ్ ఒక సినిమా ఎలాగో చేయాల్సి ఉంది. గౌతమ్ తిన్ననూరితో సినిమా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరొక మంచి డైరెక్టర్ను రామ్ చరణ్ కోసం వెతికే పనిలో పడ్డారు యూవీ క్రియేషన్స్ వారు. మరోవైపు గౌతమ్ తిన్ననూరి తన కథకు మరొక హీరోని ఇంకా వెతుక్కోవాల్సి ఉంది. శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story