Ram Charan: "విశ్వక్ సేన్ ది చిరంజీవి వ్యక్తిత్వమే," అంటున్న రామ్ చరణ్

*విశ్వక్ సేన్ పై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్

Rama Rao
Updated on: 17 Oct 2022 9:30 PM IST
Ram Charan Praised Vishwak Sen | Tollywood
X

"విశ్వక్ సేన్ ది చిరంజీవి వ్యక్తిత్వమే," అంటున్న రామ్ చరణ్ 

Ram Charan: ఈ మధ్యనే "అశోక వనంలో అర్జున కళ్యాణం" అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు "ఓరి దేవుడో" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన "ఓ మై కడవులే" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. మిథిలా పల్కార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. రాహుల్ రామకృష్ణ కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.

ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కాబోతోంది.ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశ్వక్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ''ఇచ్చిన మాటపై నిలబడేవారంటే నాకు చాలా ఇష్టం. మాటిస్తే విశ్వక్‌ కూడా నిలబడతాడు అనే మంచి పేరుంది. తన వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్‌ ను" అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

"సినిమా ఫ్లాప్‌ అయినా హిట్‌ అయినా ఎప్పుడూ సూపర్‌స్టార్‌గానే ఉండాలంటే మన పర్సనాలిటీ మీద ఆధార పడి ఉంటుంది. రజనీకాంత్‌, పవన్‌కల్యాణ్‌, చిరంజీవిలాంటివారు దానికి ఉదాహరణ. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాడే విశ్వక్‌సేన్‌. రంగస్థలం సమయంలో ఉప్పెన ఫంక్షన్‌కు వచ్చాను. అది రూ.100 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చా. ఇది కూడా అంతే పెద్ద విజయం అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు చరణ్.

Rama Rao

Rama Rao

Next Story