Ram Charan: యువ డైరెక్టర్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న చెర్రీ?

Ram Charan plans a small film before Shankars biggie?
x

రాం చరణ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Ram Charan: రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ తో బిజీగా ఉన్నాడు. అలాగే ఆచార్య సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆచార్య సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవే కాకుండా దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కొద్దిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి. కానీ ఈ ప్రాజెక్ట్ పలు కారణాలతో ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'ఇండియన్ 2' సినిమాతో డైరెక్టర్ శంకర్ ఫుల్ బిజీగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేసేందుకు చెర్రీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తల మేరకు, డైరెక్టర్ శంకర్ తో సినిమా ప్రారంభమయ్యేలోపు ఓ యువ దర్శకుడితో మీడియం బడ్జెట్ లో ఓ సినిమాని చెర్రీ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రాం చరణ్ పలువరు నిర్మాతలతో చర్చలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు ఏదీ ఫైనల్ చేయలేదని సమాచారం. ఇండియన్‌ 2 సినిమాతో డైరెక్టర్ శంకర్ బిజీగా మారితే.. చెర్రీ ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఈ గ్యాప్‌లో చిన్న బడ్జెట్‌ సినిమాను తెరకెక్కించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు ఆసక్తి చూసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్‌ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories