'ఆర్‌ఆర్‌ఆర్‌' వాయిదా పై స్పందించిన రామ్‌ చరణ్‌

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

admin1
Published on: 13 Jan 2022 5:36 PM IST
Ram Charan Opens up About RRR Delay
X

'ఆర్‌ఆర్‌ఆర్‌' వాయిదా పై స్పందించిన రామ్‌ చరణ్‌

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మొదట జూలై 30, 2020 లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత 2021లో జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ దాకా సినిమాని మళ్లీ వాయిదా వేశారు. ఇక కచ్చితంగా సినిమాని జనవరి 7, 2022 లో విడుదల అవుతుంది అని అందరూ అనుకుంటుండగా కరోనా కొత్త వేరియంట్ వల్ల సినిమాని మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇన్నిసార్లు సినిమా వాయిదా పడుతూ ఉండడం వల్ల అభిమానులకే కాక డిస్ట్రిబ్యూటర్లు కూడా కంగారుపడుతున్నారు. సినిమా అన్ని సార్లు వాయిదా పడటం గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఇలా అన్నారు, "సంక్రాంతికి మా సినిమా విడుదల అవటం లేదని మేము బాధపడట్లేదు. అది మా చేతుల్లో లేదు. మేము సినిమా కోసం చాలా ఏళ్లుగా కష్టపడి పనిచేశాం. సినిమా ని సరైన సమయంలో మాత్రమే విడుదల చేస్తాము" అని అన్నారు రామ్ చరణ్. ఇక మరోవైపు ఓటిటి ప్లాట్ఫామ్స్ నుంచి సినిమాకి భారీ ఆఫర్లు లభిస్తున్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం సినిమా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

admin1

admin1

Next Story