Ram Charan: బుచ్చిబాబు గెట్ రెడీ.. త్వరలోనే కలుద్దాం!

* నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనే చేయనున్న మెగా హీరో

Dhatripriya
Updated on: 16 Feb 2023 8:30 PM IST
Ram Charan Next Movie With This Director
X

Ram Charan: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తో నైనా?

Ram Charan: "ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ కీయారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సింది కానీ ఈ మధ్యనే ఈ సినిమా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ కన్నడ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశారు. అంతేకాకుండా రామ్ చరణ్ "ఉప్పెన" ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో కూడా ఒక సినిమాని సైన్ చేశారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రామ్ చరణ్ ముందుగా బుచ్చిబాబు సినిమాతోనే ప్రేక్షకులు ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నిన్న బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఒక ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే సెట్స్ లో కలుద్దాం అంటూ రాసుకొచ్చారు. దీంతో మెగా హీరోని నెక్స్ట్ సినిమా బుచ్చిబాబుతోనే అని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story