Prashanth Neel: రామ్ చరణ్ తో కేజీఎఫ్ డైరెక్టర్?

Prashanth Neel: ట్రిపుల్ ఆర్ మేకర్స్ తో.. రామ్ చరణ్ మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం.

Kranthi
Updated on: 8 Jun 2021 9:04 AM IST
Ram Charan Next Movie With Kgf Director Prashanth Neel
X

Ram Charan,Prashanth Neel:(File Image)

Prashanth Neel: అరేయ్.. సినిమా సూపర్.. అదిరిపోయింది.. ఏం తీశాడురా.. ఇలాంటి మౌత్ పబ్లిసిటీతో ఆ సినిమా కోసం థియేటర్లకు పరుగులు పెట్టారు ప్రేక్షకులు. ఆ సినిమా రిలీజ్ హడావుడి కన్నడలో మాత్రమే నడిచింది. మన దగ్గర అయితే అలాంటి సరైన ప్రమోషన్ లేకుండానే రిలీజ్ అయింది. కాని ప్రేక్షకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తోనే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

అది డబ్బింగ్ సినిమా అనే సంగతి పక్కనపెట్టి ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు. ఆ ఎమోషన్ తో కనెక్ట్ అయిపోయిన జనం ఊగిపోయారు. అంతటి హిట్ అయింది కేజీఎప్. దీంతో ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు క్రేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎగసింది. ప్రభాస్ తో సినిమా చేస్తుండగా లేటెస్టుగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ తో కూడా ఒక మూవీ ఫైనల్ అయినట్లు టాలీవుడ్ టాక్.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో సలార్ మూవీ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ నుంచి మరో మాస్ యాంగిల్ ను చూపించబోతున్నట్లు.. తెలుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ లు రివీల్ కావడంతో.. సలార్ సత్తా ఏ లెవెల్లో ఉంటుందో.. బయట పెట్టేశాడు ప్రశాంత్ నీల్.

ఇదిలా ఉండగానే.. ఈ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా.. ట్రిపుల్ ఆర్ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ తో.. విషెస్ చెబుతూ.. కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రశాంత్ నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ట్రిపుల్ ఆర్ మేకర్స్ తో.. రామ్ చరణ్ మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం. దీనికి డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ ను అనుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ తన నెక్ట్స్ మూవీ.. చరణ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తుందనే టాక్.. సినీ సర్కిల్ లో గట్టిగా వినిపిస్తుంది.

Kranthi

Kranthi

Next Story